అజిత్ మూవీ టీజర్ వస్తోంది
వరుస విజయాలతో సూపర్ ఫామ్ లో ఉన్నాడు కోలీవుడ్ స్టార్ అజిత్. 'శౌర్యం' శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే చాలాభాగం షూటింగ్ పూర్తిచేసుకుంది. అజిత్ పుట్టినరోజు కానుకగా ఈ మూవీ టీజర్.. మే 1న విడుదల చేయబోతున్నారు.
ఫుల్ లెన్త్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న 'వివేగం' సినిమా కోసం అజిత్ సిక్స్ ప్యాక్ చేశాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్ సిక్స్ ప్యాక్ లో అజిత్ కనిపిస్తుండడంతో.. రాబోయే టీజర్ పై అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. అజిత్ సరసన కాజల్, అక్షర హాసన్ నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ వివేక్ ఓబెరాయ్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు.
ఆగస్ట్ లో ఈ మూవీ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. అజిత్-శివ కాంబినేషన్ లో వచ్చిన 'వీరమ్', 'వేదాళమ్' సూపర్ హిట్ కావడంతో... 'వివేగం'తో హ్యాట్రిక్ హిట్ కొడతారనే ఎక్స్ పెక్టేషన్స్ నెలకొన్నాయి.