HeadLines

అంతలా రెచ్చిపోతే ఆశలపై నీళ్లు చల్లారే..!



వరుస హిట్స్ తో ఊపేస్తుందనుకున్న రెజీనాకు.. కొన్నాళ్లుగా కెరీర్ సక్సెస్ గ్రాఫ్ అమాంతం పడిపోతూ వస్తోంది. సక్సెస్ ను బట్టే అవకాశాలు ఇస్తారు కనుక.. ఛాన్సులు కూడా తగ్గాయి. టాలీవుడ్ లో పరిస్థితులు తనకు ప్రతికూలంగా మారుతుండడంతో కోలీవుడ్ తో పాటు బాలీవుడ్ పైనా కన్నేసింది రెజీనా. కానీ.. ఇప్పుడు బాలీవుడ్ లోనూ రెజీనాకు చుక్కెదురైందట.

థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌తో రూపొంది బాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన 'ఆంఖే' సినిమాకు సీక్వెల్‌గా 'ఆంఖే 2' మూవీ ప్లాన్ చేశారు. అనీస్ బజ్మి దర్శకత్వంలో విపుల్ షా నిర్మాణంలో ఈ సినిమా ప్రారంభమైంది. ఈ మూవీ  కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని ఓ రేంజిలో చేశారు. ఆ వేడుక కోసం సెక్సీగా తయారై వచ్చిన రెజీనా.. స్టేజ్ మీద డ్యాన్స్ చేసే టైమ్ లో ఆమె డ్రెస్ కొంచెం అటు ఇటు అయి కనిపించకూడని ప్రైవేట్ పార్ట్స్ కనిపించడంతో అప్పట్లో అదో హాట్ టాపిక్ అయ్యింది.

ఇక అమితాబ్ బచ్చన్ తో కలిసి పనిచేసే అవకాశం దక్కటం తో రెజీనా కెరీర్ పీక్స్ లోకి వెళ్ళడం ఖాయమనుకున్నారంతా. కానీ.. ఇప్పుడీ సినిమానే ఆగిపోయిందట. కారణాలు తెలియరానప్పటికీ కొంత భాగం షూటింగ్ కూడా అయ్యాక.. మధ్యలో ఈ ప్రాజెక్ట్ ఆపేసినట్టు తెలుస్తోంది. దీంతో బాలీవుడ్ కెరీర్ పై భారీ ఆశలు పెంచుకున్న రెజీనా... బాగా డీలాపడిపోయిందట.