HeadLines

ఐశ్వర్యారాయ్.. ఆ టాలెంట్ కూడా చూపించబోతోంది



రీఎంట్రీలో నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలకు మాత్రమే సైన్ చేస్తోన్న ఐశ్వర్యారాయ్... త్వరలో 'ఫన్నేఖాన్' అనే మూవీలో నటించనుంది. అనీల్ కపూర్ మెయిన్ రోల్ లో రూపొందనున్న ఈ సినిమాలో ఐశ్ పోషించబోయేది ఎంతో ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ అని తెలుస్తోంది.

17 యేళ్ల తరువాత ఈ జంట కలసి నటిస్తుండటం ఓ విశేషమైతే... ఈ సినిమా కోసం ఐశ్ పాట పాడుతుండటం మరో విశేషం. ఈ పాట సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ నిలవబోతుందని చెపుతున్నారు.

ఆగస్టులో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాను.. అక్టోబర్ నాటికి కంప్లీట్ చేయాలని భావిస్తున్నాడు దర్శకుడు రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా. ఏడేళ్ల క్రితం వచ్చిన 'ఎవ్రీబడీస్ ఫేమస్' అనే డచ్ మూవీ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ విషయాన్ని దర్శకుడు ప్రకాశ్ మెహ్రానే అంగీకరించారు.