మరోసారి బాలకృష్ణతో బోయపాటి
నిజానికి బాలకృష్ణ 100వ సినిమానే బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కాల్సి ఉంది. బాలకృష్ణ ఇమేజ్ కు తగ్గ ఓ పవర్ ఫుల్ స్టోరీని కూడా అప్పట్లో రెడీ చేశాడు బోయపాటి. అయితే.. తన 100వ సినిమా హిస్టారికల్ సబ్జెక్ట్ కావాలనుకున్న బాలకృష్ణ.. క్రిష్ దర్శకత్వంలో 'గౌతమిపుత్ర శాతకర్ణి'కి ఓకే చెప్పాడు. ఆ తర్వాత ఈ ఇద్దరూ ఎవరి ప్రాజెక్ట్స్ లో వారు బిజీ అయ్యారు.
బోయపాటి డైరెక్ట్ చేసిన 'జయ జానకి నాయక' ఆగస్టు-11న విడుదలవుతోంది. ఈ క్రమంలో బోయపాటి నెక్స్ట్ మూవీ ఏమిటనే విషయంపై చర్చ మొదలైంది. చిరంజీవితో సినిమా అనే ప్రచారం జరిగినా.. ఇంకా 'ఉయ్యాలవాడ' ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లలేదు కనుక.. చిరు ఫ్రీ అవడానికి చాలా టైమ్ పట్టొచ్చు. ఇక బాలకృష్ణ 'పైసా వసూల్' సినిమా దాదాపు కంప్లీట్ అయింది. ఆగస్టు నుంచి కె.ఎస్.రవికుమార్ సినిమా మొదలెట్టనున్న బాలకృష్ణ.. మూడు నెలల్లో కంప్లీట్ చేసేస్తాడట. సో.. ఈలోపు బోయపాటి స్క్రిప్ట్ సిద్ధం చేసుకుంటే.. ఈ ఏడాదే బాలకృష్ణ సినిమా మొదలెట్టేయొచ్చు.