హాలీవుడ్ నటుడు మార్టిన్ లండౌ కన్నుమూత
ప్రముఖ హాలీవుడ్ నటుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత మార్టిన్ లండౌ కన్నుమూశారు. లాస్ ఏంజిల్స్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 89 ఏళ్ల లండౌ.. వృద్ధాప్య కారణాల వల్ల గత శనివారం మరణించారు. ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ దర్శకత్వంలో వచ్చిన ’నార్త్ బై నార్త్‌వెస్ట్’ (1959) సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన లండ్రౌ.. స్పేస్, మిషన్ ఇంపాజిబుల్ వంటి టీవీ సిరీస్ తో మెప్పించారు. 1989లో వచ్చిన "క్రైమ్స్ అండ్ మిస్‌డీనర్స్" కూడా ఆయనకెంతో పేరు తెచ్చిపెట్టింది. ’ఎడ్‌వుడ్’ అనే సినిమాలో పోషించిన బెలా లుగోసి క్యారెక్టర్‌కు గానూ ఆస్కార్ అవార్డును అందుకున్నారు మార్టిన్ లండౌ.