HeadLines

అభిమాని మృతిపై రామ్ చరణ్ దిగ్భ్రాంతి

  రెండేళ్ల క్రితం రామ్ చరణ్ వీరాభి మాని అయిన ఓ బుడతడు.. "మగధీర"లోని హిట్ డైలాగ్స్ చెపుతూ వార్తల్లో నిలచిన విషయం తెలిసిందే. కామెర్ల వ్యాధితో బాధపడుతున్న పరుశురామ్ అనే ఈ బాల అభిమాని నిన్న మరణించాడు. బాలుడి మరణంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.



పరుశురామ్ కు సంబంధించిన వీడియో ఒకప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. దీంతో ఆ వీడియోను తాను ఎంతో ఇష్టంగా చూస్తానని.. ఆ కుర్రాడిని కలవాలని ఉందని అప్పట్లో ప్రకటించిన చరణ్. ఓ టీవీ ఛానల్ సహాయంతో మహబూబ్ నగర్ జిల్లా ఐజా మండలానికి చెందిన పరశురామ్ ను స్వయంగా కలిశాడు. పేద కుటుంబానికి చెందిన పరశురామ్ కు చదువుకునే స్తోమత లేదని తెలసి.. బడిలో చేర్పించడమే కాక.. బాగా చదువుకుంటే తానే జాబ్ ఇస్తానని చరణ్ హామీ ఇచ్చాడు.

పరుశురాం వీడియోలు టీవీల్లో, సోషల్ మీడియాలో చూసి మురిసిన వారంతా.. ఇప్పుడు ఈ చిన్నారిని మృతికి నివాళులు అర్పిస్తున్నారు. ఈ మృతి వార్త తెలుసుకున్న రామ్ చ‌ర‌ణ్‌తేజ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశాడు. గతంలో అతనని కలసినప్పటి ఫోటోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన చరణ్.. ఈ వార్త విని షాక్ అయ్యానని.. బాలుడి కుటుంబ స‌భ్యుల‌కి ప్ర‌గాఢ సానుభూతి తెలియజేశాడు.