నాని వర్సెస్ నాని.. టైటిల్ ఫిక్స్
'కృష్ణార్జున యుద్ధం' అనే టైటిల్ ను ఈ సినిమాకు ఖరారు చేశారు. మొదటి నుంచి ప్రచారంలో ఉన్నట్టుగానే ఈ సినిమాలో నాని డ్యుయల్ రోల్ లో నటిస్తున్నాడు ఈ విషయాన్ని సూచిస్తూ.. టైటిల్ లోగోకు పైన నాని వర్సెస్ నాని అని వేశారు. అంతేకాక.. పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ లో పైన ప్రాచీన దేవాలయం... కింది భాగంలో ప్యారిస్ నగరాన్ని చూపిస్తూ.. నాని డ్యుయల్ రోల్స్ లో ఒకరు పల్లెటూరిలో మరొకరు ప్యారీస్‌లో ఉంటారనే హింట్ ఇచ్చారు. మొత్తానికి ఓల్డ్ టైటిలే అయినప్పటికీ.. ఇంప్రెసివ్‌గా డిజైన్ చేశారు.
తమిళ మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమిజా ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. 'ద్రువ' తర్వాత తెలుగులో హిప్ హాప్ తమిజా చేస్తోన్న సెకండ్ సినిమా ఇది. వెంకట్ బోయినపల్లి ఈ సినిమాను నిర్మిస్తుండగా... ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ విషయాలను త్వరలో వెల్లడి కానున్నాయి.