పేరు మార్పుతోనైనా ఆదికి కలిసొచ్చేనా..!
సినిమాల కోసం పేరు మార్చుకునే వారు కొందరైతే.. అదే సినిమాల్లో సక్సెస్ కోసం పేరు మార్చుకునే వారు మరికొందరు. ఇటీవలి కాలంలో ఎక్కువగా హీరోయిన్సే సక్సెస్ కోసం పేరు మార్చుకుంటున్నారు. కానీ ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరో ఆది కూడా పేరు మార్చుకుంటున్నాడట. అలాగని తన పేరుని పూర్తిగా మార్చేయడం లేదు కానీ.. పేరు చివరన.. తండ్రి పేరును యాడ్ చేస్తున్నాడు. అంటే.. ఇకపై సాయి కాస్తా.. ఆది సాయికుమార్ అవనున్నాడు.
జులై-14న విడుదలవుతోన్న 'శమంతకమణి' చిత్రంతోనే ఆది పేరు మారబోతోందట. టైటిల్ కార్డ్స్ లో ఆది సాయికుమార్ అని కనిపించబోతోందట. నిజానికి.. ఇలా పేరుకు చివరన తండ్రి పేరును జత చేసుకోవడం తమిళ సంప్రదాయం. అఫ్ కోర్స్.. ఆది ఇలా పేరు మార్చుకుంటోంది మాత్రం సక్సెస్ కోసం. పైగా నటుడిగానే కాక డబ్బింగ్ కళాకారుడిగానూ సాయికుమార్ ఎంతో పాప్యులర్. మరి.. తండ్రి పేరు జత చేరాకైనా ఆది సక్సెస్ గ్రాఫ్ మారుతుందేమో చూద్దాం..!