HeadLines

మరో క్రేజీ ప్రాజెక్ట్ పట్టిన కాజల్ అగర్వాల్

 హీరోయిన్‌గా సక్సెస్ అవ్వాలంటే టాలెంట్‌తో పాటు అదృష్టం కూడా కలసి రావాలి. ఈ విషయంలో కాజల్ అగర్వాల్ ను లక్కీ గర్ల్ అనక తప్పదు. ఫేడవుట్ అయిపోతోంది అనుకున్న ప్రతిసారి కాజల్‌కు ఏదో రూపంలో ఓ లక్కీ ఛాన్స్ వస్తూనే ఉంది. తెలుగు, తమిళ భాషల్లో ప్రస్తుతానికైతే కాజల్ కెరీర్‌కు ఎలాంటి డోకా లేదు. కానీ.. గతంలో ప్లాపులు అందుకున్న బాలీవుడ్‌లోనూ ఇప్పుడు కాజల్ మరో ఛాన్స్ అందుకోవడం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

బాబీ డియోల్ కు జంటగా ‘యామ్లా పగ్లా దీవానా-3’లో ఛాన్స్ అందుకుంది కాజల్ అగర్వాల్. ఓ నెలరోజుల క్రితమే ఈ సినిమాకు కాజల్ సైన్ చేసినట్టు తెలుస్తోంది. ఆగస్టు ఫస్ట్ వీక్ నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవనుండగా.. డిఫరెండ్ షేడ్స్ ఉండే మోడ్రన్ గర్ల్ క్యారెక్టర్ లో కాజల్ ఈ చిత్రంలో నటించనుందట. 



ధర్మేంద్ర, బాబీ డియోల్, సన్నీ డియోల్‌ కలసి నటించిన ‘యామ్లా పగ్లా దీవానా’ సినిమా 2011లో విడుదలై ఘనవిజయం సాధించింది. దీంతో.. 2013లో దీనికి సీక్వెల్ తెరకెక్కిస్తే పరాజయమే మిగిల్చింది. కానీ.. ఈ సిరీస్ మీద భరోసాతో ఇప్పుడో మరో సీక్వెల్ చేస్తున్నారు. మరి.. హిందీలో అసలే విజయాలు లేని కాజల్‌కు.. ఈ యాక్షన్ కామెడీ మూవీ అయినా హిట్ ఇస్తుందేమో చూద్దాం..!