HeadLines

టీజర్ టాక్: 'జయ జానకి నాయక'


బోయపాటి శ్రీను సినిమా అనగానే హై ఓల్టేజ్ యాక్షన్ ను ఎక్స్ పెక్ట్ చేస్తారు ప్రేక్షకులు. కానీ.. తాజా చిత్రం 'జయ జానకి నాయక' సినిమా ప్రమోషన్ చూస్తుంటే.. బోయపాటి ఈ యాక్షన్ ఇమేజ్ నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ నుంచి.. ఈరోజు విడుదలైన టీజర్ వరకూ బోయపాటి మార్క్ కు భిన్నంగా ఉండటమే ఇందుకు నిదర్శనం.
బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘జయ జానకి నాయక’ టీజర్ ను ఈరోజు విడుదల చేశారు. హీరో హీరోయిన్ల మధ్య సాగే రొమాంటిక్ ట్రాక్ ను హైలెట్ చేస్తూ ఈ టీజర్ కట్ చేయించారు. రిషీ పంజాబీ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటున్నప్పటికీ.. హీరో మాత్రం 'సరైనోడు' సినిమాలో బన్నీలా కనిపిస్తున్నాడు. రకుల్ సైతం.. 'సరైనోడు' సీన్స్ రిపీట్ చేస్తున్నట్టే అనిపిస్తోంది. అయితే.. ఈ రొమాంటిక్ ట్రాక్ ను కేవలం టీజర్ లోనే ప్రజంట్ చేశారా.. లేక సినిమా కూడా ఇలాగే ఉండనుందా అనే సందేహాలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ట్రైలర్ వస్తేనే.. ఇది బోయపాటి మార్క్ యాక్షన్ సినిమానా కాదా అనేది తెలియనుంది.