HeadLines

నాని నెక్స్ట్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్


రీసెంట్ గా 'నిన్నుకోరి' సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన నాని.. ప్రస్తుతం 'ఎమ్.సి.ఎ' (మిడిల్ క్లాస్ అబ్బాయి)లో నటిస్తున్నాడు. దిల్ రాజు నిర్మాతగా వేణుశ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే 30 పర్సంట్ షూటింగ్ పూర్తి చేసుకుంది. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కావచ్చుననే ప్రచారం జరిగినప్పటికీ.. ఈ ఏడాదే 'ఎమ్.సి.ఎ.' సినిమా విడుదల కానుందట.

డిసెంబర్ 28న  'ఎమ్.సి.ఎ.' సినిమాను విడుదల చేయబోతున్నాడట దిల్ రాజు. ఈ ఏడాది ఇప్పటికే 'నేను లోకల్', 'నిన్నుకోరి' సినిమాలు విడుదల కాగా.. నాని నుంచి రాబోతున్న మూడో సినిమా ఇది కానుంది. గతేడాది కూడా నాని నటించిన మూడు సినిమాలు విడుదలై విజయం సాధించాయి. సో.. ఏడాదికి మూడు సినిమాల చొప్పున జెట్ స్పీడుతో దూసుకెళ్తున్నాడు నాని.