HeadLines

ప్రభాస్.. 'సాహో' న్యూ లుక్ సూపర్...

 'బాహుబలి' పాత్రలో కనిపించేందుకు ఎంతగానో కష్టపడ్డ ప్రభాస్.. ఇప్పుడు 'సాహో' కోసం కొత్తగా కనిపించేందుకు మరింత తపన పడుతున్నాడు. ఇందుకోసం డిఫరెంట్ లుక్స్ ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆమధ్య విమానంలో క్లీన్ షేవ్ లో కనిపించి సర్ప్రైజ్ చేసిన ప్రభాస్.. ఇప్పుడో సరికొత్త లుక్ తో అభిమానులను ఆకట్టుకుంటున్నాడు.

'బాహుబలి-2' సినిమా రిలీజ్‌తో పాటే 'సాహో' టీజర్ వచ్చినప్పటికీ.. సినిమా మాత్రం ఇంతవరకూ సెట్స్ పైకి వెళ్లలేదు. 'సాహో' కోసం గత మూడు నెలలుగా రకరకాల స్టైల్స్ ట్రై చేసిన ప్రభాస్.. ఈ లుక్ ను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. ఇదైనా ఫైనల్ చేస్తాడా లేక మార్పులు ఉంటాయా అనేది తెలియాల్సి ఉంది. అయితే.. ఫ్యాన్స్ కు మాత్రం ఈ లుక్ సూపర్బ్ గా నచ్చేసింది.

సుజిత్ దర్శకత్వంలో రూపొందనున్న 150కోట్ల భారీ బడ్జెట్ మూవీకి శంకర్-ఎహహ్ సాన్-లాయ్ సంగీతం సమకూరుస్తుండగా.. పీటర్ హెయిన్స్ యాక్షన్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించనున్నాడు. బాలీవుడ్ హీరో నీల్ నితిన్ ముఖేష్ విలన్ గా నటిస్తుండగా.. హీరోయిన్ ఎంపిక జరగాల్సి ఉంది.