HeadLines

సేమ్ మేజిక్ రిపీట్ చేస్తోన్న పవన్



'ఖుషి' సినిమా మొదలు.. ఇప్పటివరకూ పవన్ పలుమార్లు పాటలు పాడినప్పటికీ.. ‘అత్తారింటికి దారేది’ సినిమా కోసం పాడిన ‘కాటమరాయుడా..' సాంగ్ సూపర్ హిట్ అవడంతో పాటు పవన్ సినిమాకే టైటిల్ కూడా అయింది. ఈ క్రమంలో మరోసారి పవన్ చేత పాట పాడిస్తున్నాడట దర్శకుడు త్రివిక్రమ్.

తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ రవించంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. అనిరుధ్ ఇప్పటికే వపన్ కోసం ఓ స్టైలిష్ ట్యూన్ సిద్ధం చేసేశాడట. 'కాటమరాయుడా' తరహాలో ఈ పాట కూడా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడం ఖాయమంటున్నారు. ఇక పవన్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా నటిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేశ్, అను ఇమ్మాన్యుయల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. హారికా హాసినీ క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.