చిరు 'ఉయ్యాలవాడ'కు ముహూర్తం మారింది
'ఖైదీ నంబర్ 150'తో రీఎంట్రీ అదరగొట్టేసిన మెగాస్టార్.. నెక్స్ట్ మూవీని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందబోతోంది. ఇప్పటివరకూ స్టైలిష్ డైరెక్టర్ గా పిలిపించుకున్న సురేందర్ రెడ్డికి ఇదే ఫస్ట్ హిస్టారికల్ మూవీ. పైగా రామ్ చరణ్ సొంత బ్యానర్ లో హై బడ్జెట్ తో తెరకెక్కబోతున్న చిత్రం.
ఆగస్ట్ 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను లాంఛ్ చేయబోతున్నారని అభిమానులంతా భావించారు. అయితే.. స్వాతంత్ర్య సమరయోధుడి లైఫ్ స్టోరీ కావడంతో.. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు-15న ప్రారంభించడం సమంజసంగా ఉంటుందన్నాడట దర్శకుడు సురేందర్ రెడ్డి. రామ్ చరణ్ తోపాటు చిరు కూడా ఇందుకు పచ్చజెండా ఊపడంతో.. పంద్రాగస్టునే ఈ సినిమా ప్రారంభించబోతున్నారు.