HeadLines

నితిన్ 'లై' సినిమా టీజర్ విడుదల




నితిన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'లై'. 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తోన్న ఈ మూవీతో మేఘా ఆకాశ్ టాలీవుడ్ కు పరిచయం అవుతోంది. 13 ఏళ్ల విరామం తర్వాత (గతంలో శ్రీ ఆంజనేయం') నితిన్-అర్జున్ కలసి నటించడం విశేషం.

ఎక్కువభాగం అమెరికాలోనే ఈ సినిమా షూటింగ్ జరిగింది. ఆగస్టు-11న ఈ సినిమా విడుదల కానుండగా.. ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ ను కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. హీరో నితిన్ తో పాటు కీరోల్ ప్లే చేస్తోన్న యాక్షన్ కింగ్ అర్జున్ స్టైలిష్‌ లుక్ లో ఆకట్టుకున్నారు.

ఓ వైపు అర్జున్, మరోవైపు నితిన్ స్టైలిష్ లుక్ లో కనిపిస్తుండగా.. బ్యాక్ గ్రౌండ్ లో వినిపిస్తోన్న ఓ గంభీరమైన వాయిస్ పై టీజర్ కట్ చేశారు. "కోట్లమంది సైనికులు సరిపోలేదట.. పంచ పాండవులు సాధించలేదట.. చివరకు కృష్ణుడు ఒంటరి కాదట.. అబద్దం తోడు లేకుండా ఏ కురుక్షేత్రం పూర్తవదట అశ్వద్ధామ హతః కుంజరః" అనే బ్యాక్ గ్రౌండ్ వాయిస్ తో 'లై' సినిమాలో అబద్దాలకు ఉండే ఇంపార్టెన్స్ చెప్పించారు.