HeadLines

విఠలాచార్య‘ ఫస్ట్ లుక్: నాలుగు కళ్లు, మూడు ముఖాలు



'నందిని నర్సింగ్ హోమ్' అనే సినిమాతో హీరోగా పరిచయం అయిన నరేశ్ కొడుకు నవీన్ విజయకృష్ణ.. ఇప్పుడు 'విఠలాచార్య' పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నరేశ్ కీలకపాత్రలో నటిస్తుండగా.. విజయనిర్మల, అనీషా ఆంబ్రోస్‌, ఇంద్రజ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. కొత్త దర్శకుడు సుహాస్‌ మీరా తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.




'విఠలాచార్య' అనే టైటిల్ తో ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా.. ఇప్పుడు ఫస్ట్ లుక్ విషయంలోనూ వైవిధ్యం ప్రదర్శించింది. నాలుగు క‌ళ్ల‌లో మూడు ముఖాలు కనిపిస్తోన్న ఫొటోపై... ఒక్క దేవుడు.. ఇద్దరు వ్యక్తులు.. ఓ దాగి ఉన్న నిజం అంటూ డిఫరెంట్ గా ఫస్ట్ లుక్ ను డిజైన్ చేశారు. స్ర్కిప్ట్‌ బుక్‌ క్రియేషన్స్ పతాకంపై ఎస్‌.కె.విశ్వేశబాబు, కె.ఎస్ .టి. యువరాజ్‌, యం.వి.కె.రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. టాలీవుడ్ యంగ్ హీరోస్ సాయిధ‌ర‌మ్ తేజ్‌, వ‌రుణ్ తేజ్‌, సందీప్ కిష‌న్ ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో హీరో నవీన్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.