డ్రగ్స్ కేసులో హైకోర్టును ఆశ్రయించిన ఛార్మి
డ్రగ్స్ కేసులో విచారణ తీరు సరిగా లేదంటూ హీరోయిన్ ఛార్మి.. హైకోర్టును ఆశ్రయించింది. శాంపిల్స్ సేకరణ సరి కాదంటూ ఛార్మి హైకోర్టులో రిట్ వేసింది. తనను మహిళా అధికారులతో విచారణ జరిపించాలని ఆమె కోరింది. ఆర్టికల్-20 సబ్ క్లాజ్-3 ప్రకారం బలవంతంగా బ్లడ్ శాంపిల్స్ ను సేకరించవద్దంటూ ఛార్మి కోరింది. సిట్ విచారణకు తనతో పాటు లాయర్ ను కూడా తీసుకెళ్లేలా తనకు వెసులుబాటు కల్పించాలని పిటిషన్ లో విన్నవించిన ఛార్మి.... సిట్ విచారణ పద్దతి తన పరువుకు భంగం కలిగించేలా ఉందని పేర్కొంది. ఈ నెల 26వ తేదీన ఛార్మి సిట్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇక ఛార్మి దాఖలు చేసిన పిటీషన్ ఈరోజు మధ్యాహ్నం విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.