HeadLines

జగపతిబాబు ‘పటేల్ సర్’ సెన్సార్ కంప్లీట్



కొన్నాళ్లుగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ అయిన జగపతిబాబు తిరిగి కథానాయుడిగా నటిస్తోన్న చిత్రం 'పటేల్ సార్'. వారాహి చలనచిత్రం బ్యానర్ పై సాయి కొర్రపాటి నిర్మించిన ఈ సినిమాకు వాసు పరిమి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల సన్నాహాల్లో ఉన్న ఈ సినిమా.. తాజాగా సెన్సార్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుంది.

యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ను జారీ చేసింది. జగపతిబాబుతో పాటు పద్మప్రియ, తాన్య హాప్‌, సుబ్బరాజు, పోసాని, రఘుబాబు, శుభలేఖ సుధాకర్‌, కబీర్‌ సింగ్‌, పృథ్వి, బేబీ డాలీ ఇతర పాత్రలు పోషించారు. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తవడంతో ఈ నెల 14న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్టు నిర్మాత సాయికొర్రపాటి తెలిపారు.