HeadLines

'నిన్ను కోరి' రిజల్ట్‌కు సారీ చెప్పిన నాని


టాలీవుడ్ యంగ్ హీరోస్ అందరికీ పోటీనిస్తూ... వరుస విజయాలతో దూసుకెళుతున్నాడు నాని. తాజా చిత్రం 'నిన్ను కోరి' కూడా సక్సెస్ టాక్ తెచ్చుకోవడంతో నాని ఫుల్ జోష్ గా ఉన్నాడు. కేవలం క్లాస్ ఆడియన్స్ టార్గెట్ గా తెరకెక్కించిన ఈ సినిమా మాస్ ఆడియన్స్ ను సైతం అలరించడం నానిని ఆశ్చర్యపరచింది. దీంతో.. 'నిన్నుకోరి' విషయంలో తన అంచనా తప్పినందుకు నాని ప్రేక్షకులకు సారీ చెప్పాడు.

సిటీస్, మల్టీప్లెక్సులతో పాటు ఓవర్సిస్ ప్రేక్షకులకు ఈ సినిమా బాగుంటుంది కానీ.. బి..సి.. సెంటర్స్ వారికి అంతగా నచ్చకపోవచ్చు అని గతంలో తాను చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు నాని. "'నిన్ను కోరి' సినిమాను ప్రేక్షకులంతా ఆదరిస్తున్నారని... మాస్.. మాస్ అని మిమ్మల్ని తక్కువ అంచనా వేస్తూ... మాకు మేమే డిసైడ్ అయ్యి.. మీరు మంచి సినిమాలు చూడరని అనుకున్నందుకు.. తనతో పాటు ఇండస్ట్రీ తరపు నుంచి క్షమించమని మనస్పూర్తిగా క్షమాపణలు కోరుతున్నాను" అని నాని అన్నాడు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ టీవీ ఛానల్ లో నాని ఇలా స్పందించాడు.