నితిన్-పవన్ సినిమా.. షూటింగ్ షురూ
ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ కొత్త చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమాకు గీత రచయిత కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ మూవీకి త్రివిక్రమ్ కథను అందించడం ఓ విశేషమైతే.. స్క్రీన్ ప్లే, మాటలు మాత్రం కృష్ణ చైతన్యే సిద్ధం చేసుకున్నాడు. గతంలో నారా రోహిత్ హీరోగా వచ్చిన 'రౌడీ ఫెలో' సినిమాకు కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. త్రివిక్రమ్ కథ, పవన్ ప్రొడక్షన్ కావడంతో.. ఓపెనింగ్‌కు ముందే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.