‘జై లవ కుశ’ ఆడియో రిలీజ్ డేట్
ఎన్టీఆర్ హీరోగా బాబి దర్శకత్వంలో రూపొందుతున్న 'జై లవకుశ' సినిమాపై అంచనాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఎన్టీఆర్ త్రిపుల్ రోల్‌లో నటించడం.. అందులో ఒక క్యారెక్టర్ నెగటివ్ పొలిషీయన్ కావడంతో సినిమాపై మరింతగా ఆసక్తి పెరిగింది. దీంతో.. సినిమా బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరుగుతోందట. రెండు తెలుగు రాష్ట్రాలకు కలపి ఈ మూవీ థియేట్రికల్ రైట్స్.. రూ.70 కోట్లకి అమ్ముడైనట్టు తెలుస్తోంది.
ఈమధ్య కాలంలో ఇంత స్పీడుగా.. ఈ స్థాయిలో బిబినెస్ అయిన సినిమా ఇదేనంటున్నారు. ఇదిలా ఉంటే.. 'జై లవకుశ' సినిమా ఆడియో రిలీజ్ డేట్ కూడా ఖరారు చేసినట్టు సమాచారం. ఆగస్టు-12న హైదరాబాద్‌లో ఈ ఆడియో రిలీజ్ ఈవెంట్ నిర్వహిచేందుకు సన్నాహాలు చేస్తున్నారట. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తుండగా.. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ ఈ సినిమా నిర్మిస్తున్నాడు. ఎన్టీఆర్ సరసన రాశి ఖన్నా, నివేతా థామస్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.