HeadLines

రాజశేఖర్ తో చేయాల్సింది.. రానాతో

రానా హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రం ఈ నెల 11న విడుదల కాబోతోంది. ఈ సినిమాలో రానా జోగేంద్ర అనే నెగటివ్ షేడ్స్ ఉండే పొలిటీషియన్ గా నటిస్తున్నాడు. రాయలసీమకు చెందిన ఓ వడ్డీ వ్యాపారి.. రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాడు..  రాజకీయనేతగా ఎలా ఎదిగాడు అనేది ఈ సినిమా కథాంశంగా తెలుస్తోంది. నిజానికి ఈ పాత్రలో నటించాల్సింది రాజశేఖర్ అట.

'హోరాహోరి' వంటి డిజాస్టర్‌ తర్వాత రాజశేఖర్ హీరోగా 'అహం' అనే సినిమా ప్లాన్ చేశాడు తేజ. కానీ రాజశేఖర్ కొన్ని మార్పులు కోరడం.. వాటికి తేజ నో చెప్పడంతో.. క్రియేటివ్ డిఫరెన్స్ లతో 'అహం' ఆగిపోయింది. అదే కథను సురేష్ బాబుకు చెప్పి.. కొద్దిపాటి మార్పులతో రానాతో 'నేనే రాజు నేనే మంత్రి'గా తెరకెక్కించాడట తేజ. రాజశేఖర్ తో పోల్చితే.. తేజ తన సినిమాను రానాతో చేయడం బెస్ట్ ఛాయిస్ అనే చెప్పాలి. కొన్నాళ్లుగా ప్లాపుల్లో ఉన్న తేజకు.. రానా అయినా హిట్ ఇస్తాడేమో చూద్దాం.!