HeadLines

'స్పైడర్' టీజర్: భయపెట్టడం తెలుసు అంటోన్న ప్రిన్స్


మహేశ్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న 'స్పైడర్' సినిమా టీజర్ వచ్చేసింది. మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ టీజర్ ను విడుదల చేశారు. కొద్దిసేపటి క్రితం విడుదలైన కొద్ది నిముషాల వ్యవధిలోనే వేల కొలది వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకెళుతోంది.

'పెరుగుతున్న జ‌నాభాను కంట్రోల్‌ చేసేందుకు గ‌వ‌ర్న్‌మెంట్‌, భూకంపం, ఈ సునామీలా నేనూ ఒక భాగమే' అంటూ విలన్‌గా నటిస్తోన్న ఎస్ జే సూర్య చెప్పే డైలాగ్‌తో విలన్ ఎంతటి రాక్షసుడో, బలవంతుడో, సైకోనో తెలియచెప్పిన దర్శకుడు మురుగదాస్.. 'భయపెట్టడం మాకూ తెలుసు' అన్న మహేశ్ డైలాగ్ లో ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనే సూపర్ హీరోగా ప్రిన్స్ ను చూపిస్తాడన్న విషయం అర్థమవుతోంది. ఇక 'ఐ నీడ్ ఏ బ్లైండ్ డేట్' అంటూ.. రొమాంటిక్ యాంగిల్ ను టచ్ చేశాయి రకుల్ ప్రీత్ సింగ్ డైలాగ్స్.


మొత్తానికి గతంలో ఓ బుల్లి టీజర్ తో ఓ స్పైని మాత్రమే చూపించిన మురుగదాస్.. ఈ కొత్త టీజర్ లో సమస్య ఏంటో చూపించి.. హీరోగా మహేశ్ తెగువను మనకు పరిచయం చేశాడు. ప్రిన్స్ బర్త్ డే రోజున వచ్చిన ఈ టీజర్.. అభిమానులను ఫుల్ గా ఇంప్రెస్ చేసేసింది. ఇక దసరా కానుకగా సెప్టెంబర్ లాస్ట్ వీక్ లో ఈ సినిమా విడుదల కాబోతోంది.