నాగ్ బర్త్ డేకి.. అభిమానులకు ట్రీట్ సిద్ధం
నాగార్జున హీరోగా నటిస్తోన్న ‘రాజు గారి గది-2’ చిత్రానికి సంబంధించి లోగోను విడుదల చేశారు. ఓంకార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో సమంత కీలకపాత్రను పోషిస్తుండగా... సీరత్ కపూర్ నాగ్ కు జంటగా నటిస్తోంది. పీవీపీ సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దీపావళి కానుకగా అక్టోబరు 13న ఈ మూవీని విడుదల చేయాలని నిర్ణయించారు.
విడుదలకు మరో నెలన్నర సమయం మాత్రమే ఉండడంతో కాబోలు.. సినిమా ప్రమోషన్ మొదలెట్టేస్తున్నారు. ఆగస్టు 29న నాగార్జున పుట్టిన రోజు కాగా... ఆ రోజున ‘రాజు గారి గది-2’ ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తారట. అది మొదలు.. ఒక్కో ప్రమోషనల్ ఈవెంట్ తో సందడి పెంచనున్నారు. 'రాజు గారి గది'కి సీక్వెల్ గా రూపొందుతోన్న ఈ మూవీలో నాగ్ మోడరన్ మాంత్రికుడిగా నటిస్తున్నాడు. ఆ గెటప్ నే నాగ్ ఫస్ట్ లుక్ గా విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది.