HeadLines

ఘంటసాల మనవరాలితో 'క్షణం' దర్శకుడి ప్రేమకథ

లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది సినిమాల్లో మాత్రమే ఎక్కువగా సాధ్యమనుకుంటారు చాలామంది. నిజ జీవితంలోనూ ఇలాంటి ప్రేమకథలెన్నో. ఈ వరుసలో ఇప్పుడు 'క్షణం' దర్శకుడు రవికాంత్ పేరెపు కూడా చేరాడు. ఇప్పుడు ఇతని ప్రేమకథ పెళ్లివరకూ వచ్చింది. ఇటీవల చెన్నైలో ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది.

లవ్ స్టోరీలో ఫస్ట్ సీన్ ఓపెన్ చేస్తే.. ఘంటసాల మనవరాలు.. ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఘంటసాల రత్నకుమార్ కూతురైన వీణ.. 'క్షణం' సినిమాలోని హీరోయిన్ అదాశర్మ పాత్రకు డబ్బింగ్ చెప్పేందుకు స్టూడియోకు వచ్చింది. ఆ సినిమాకు దర్శకుడైన రవికాంత్ కు తొలిచూపులోనే వీణతో ప్రేమలో పడ్డాడు. బ్యాక్ గ్రౌండ్ లో 'మాయాబజార్' కోసం ఘంటసాల గారు పాడిన 'చూపులు కలసిన శుభవేళ' పాట వినిపించింది. సీన్ కట్ చేస్తే.. ఇటీవల చెన్నైలో వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ జరిగింది. నవంబర్-11న వివాహ తేదీ ఖరారైంది. మొత్తానికి థ్రిల్లర్ సినిమాతో హిట్ అందుకున్న రవికాంత్.. నిజజీవితంలో తన లవ్ స్టోరీని కూడా సక్సెస్ చేసుకున్నాడు.