HeadLines

చిరంజీవికి గురువుగా అమితాబ్ బచ్చన్

చిరంజీవి తాజా చిత్రం `సైరా న‌ర‌సింహ‌రెడ్డి`లో అమితాబ్ కూడా న‌టించ‌నున్న విషయాన్ని ఇటీవల అఫీషియల్ గానే అనౌన్స్ చేశారు. అమితాబ్ వంటి బాలీవుడ్ మెగాస్టార్.. ఈ సినిమాలో నటిస్తున్నారంటే.. ఆ పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉండే ఉండాలి. అందుకే.. ఆ క్యారెక్టర్ ఏమై ఉంటుందా అనే ఆసక్తి నెలకొంది.

ఉయ్యాలవాడ న‌ర‌సింహారెడ్డికి గురువు పాత్రలో అమితాబ్ నటించ‌నున్నార‌ని తాజా సమాచారం. సినిమాకు ఇది కీరోల్ కావడం.. పోరాట స్ఫూర్తిని ర‌గిలించే గురువు పాత్ర కావడంతో.. ఆ క్యారెక్టర్ కు అమితాబ్ ను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఇక నయనతార హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో జ‌గ‌ప‌తి బాబు, సుదీప్‌, విజ‌య్ సేతుప‌తిలు ఇతర కీల‌క పాత్రలు పోషిస్తున్నారు.