HeadLines

తమిళ రీమేక్ లో నటించనున్న రవితేజ


ప్రస్తుతం రవితేజ హీరోగా రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. అందులో ఒకటి ‘రాజా ది గ్రేట్’ కాగా.. మరొకటి ‘టచ్ చేసి చూడు’. ఇప్పటికే టీజర్ విడుదలైన  ‘రాజా ది గ్రేట్’ అతి త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే రవితేజ మరో కొత్త సినిమాకు కమిట్ అయినట్టు తెలుస్తోంది. అదికూడా ఓ తమిళ రీమేక్ చిత్రంలో.

రవితేజ కథానాయకుడిగా 'భోగన్' అనే తమిళ సినిమా తెలుగులో రీమేక్ కాబోతున్నట్టు సమాచారం. ఈ ఏడాది ప్రారంభంలో తమిళనాట విడుదలైన ఈ సినిమాలో జయం రవి, అరవింద్ స్వామి ప్రధానపాత్రలు పోషించారు. గతంలో ఈ ఇద్దరూ ‘తనీ ఒరువన్’లో కలసి నటించగా.. ఆ సినిమా ‘ధృవ’ పేరుతో తెలుగులో రీమేక్ అయింది. ఇప్పుడు అదే బాటలో 'భోగన్' కూడా తెలుగులోకి వస్తోంది. ఇక జయం రవి పోషించిన పాత్రలో రవితేజ.. అరవింద్ స్వామి పాత్రను రోనియ్ రాయ్ పోషించనున్నట్టు తెలుస్తోంది. ఒరిజినల్ వెర్షన్ దర్శకుడు లక్ష్మణ్.. తెలుగు రీమేక్ కు కూడా దర్శకత్వం వహించనుండగా.. యువదర్శకుడు పవన్ సాధినేని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఈ స్క్రిప్ట్ లో మార్పులు చేస్తున్నట్టు తెలుస్తోంది.