హిరణ్యకశ్యపుడిగా వెంకీ కాదు రానా
'రుద్రమదేవి' వంటి చారిత్రక చిత్రం తర్వాత పౌరాణిక చిత్రంపై దృష్టి సారించారు గుణశేఖర్. పురాణాల్లోని భక్త ప్రహ్లాదుడి కథను హిరణ్యకశ్యపుడి కోణంలో తెరకెక్కించేందుకు గానూ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఇటీలవ తిరుమలలో గుణశేఖర్ వెల్లడించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న ఈ ప్రాజెక్ట్ లో హిరణ్యకశ్యపుడిగా వెంకటేశ్ నటించబోతున్నారని గత కొద్దిరోజులుగా భారీ ప్రచారం జరుగుతోంది. కానీ ఆ పాత్రలో నటించబోయేది రానా అని తాజా సమాచారం.
డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ పై ఆసక్తి చూపిస్తోన్న రానాకు.. గుణశేఖర్ చెప్పిన కథతో పాటు, హిరణ్యకశ్యపుడి పాత్ర నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ కు అంగీకరించినట్టు తెలుస్తోంది. గతంలో ‘కృష్ణం వందే జగద్గురుమ్’లోని ఓ సన్నివేశంలో హిరణ్యకశ్యపుడిని సంహరించే నరసింహస్వామిగా కాసేపు కనిపించాడు రానా. ఇక గతంలో జూ.ఎన్టీఆర్ తో పౌరాణిక చిత్రం 'బాలల రామాయణం'ను తెరకెక్కించి మెప్పించాడు గుణశేఖర్.