HeadLines

చిరు 'సైరా'కు 'సూపర్‌మేన్' స్టంట్ కొరియోగ్రాఫర్


చిరంజీవి బర్త్ డే కానుకగా.. ఆయన కొత్త చిత్రానికి  ‘సైరా నరసింహారెడ్డి’ టైటిల్ ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. మొదటి నుంచి ఈ సినిమా హాలీవుడ్ స్టాండర్డ్స్ లో తెరకెక్కబోతుందని జరుగుతున్న ప్రచారానికి తగ్గట్టే..  ఫస్ట్ మోషన్ పోస్టర్ తోనే ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచారు. మరోవైపు.. సినిమాను జాతీయ స్థాయిలో నిలబెట్టేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తోంది కొణిదెల ప్రొడక్షన్స్.

స్వాతంత్ర్య పోరాటం నేపథ్యంలో తెరకెక్కే సినిమా కావడంతో.. భారీ యాక్షన్ సన్నివేశాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. దీంతో ఇందుకోసం హాలీవుడ్ నుంచి స్టంట్ మాస్టర్ ను తీసుకున్నారు. హాలీవుడ్ మూవీ ‘స్పైడర్ మ్యాన్’కు స్టంట్ కొరియోగ్రాఫర్ అయిన టోనీ చింగ్.. 'సై రా.. నరసింహారెడ్డి'కి పోరాటాలు అందించనుండటం విశేషం.

హాలీవుడ్ సినిమాలకు యాక్షన్ కొరియోగ్రఫీ అందించే టాఫ్-10 హాంకాంగ్ ఫైట్ మాస్టర్స్ లో టోనీ చింగ్ కూడా ఒకరు. స్వతహాగా దర్శకుడు, నటుడు కూడా అయిన టోనీ చింగ్.. యాక్షన్ కొరియోగ్రఫీలో 30 ఏళ్ల అనుభవముంది. పైగా.. చింగ్ కంపోజ్ చేసిన ఫైట్స్ లో ఎక్కువభాగం కత్తియుద్ధాలే. ఇంత టాలెంటెడ్ పర్సన్ కనుకే.. చిరు సినిమా కోసం ఇతన్ని ఎంచుకున్నారు. ఈ హాంకాంగ్ ఫైట్ మాస్టర్ కు.. ఇండియన్ సినిమాలేం కొత్త కాదు. గతంలో హృతిక్ 'క్రిష్‌', 'క్రిష్-3' చిత్రాలకు టోనీ చింగ్ యాక్షన్ కొరియగ్రఫీ అందించాడు.