HeadLines

ఎన్టీఆర్ 'లవ' టీజర్ రిలీజ్ డేట్

ఎన్టీఆర్ 'జై లవకుశ' సినిమాకు సంబంధించి.. ఇప్పటికే విడుదలైన 'జై' పోస్టర్ అండ్ టీజర్ కు ప్రేక్షకుల నుంచి అన్యూహ్య స్పందన లభించింది. ఇక రీసెంట్ గా వచ్చిన 'లవ' ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా సూపర్బ్ రెస్పాన్స్ లభించింది. ఈ క్రమంలో 'లవ' టీజర్ కోసం అభిమానులంతా ఆతృతతో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ టీజర్ డేట్ కూడా ఖరారైంది.

 'వినాయక చవితి' సందర్భంగా ఆగస్టు 25న 'జై లవకుశ' సినిమాకు సంబంధించిన 'లవ' టీజర్ ను విడుదల చేయబోతున్నారు. ఎలాగూ ఆ తర్వాత సినిమా విడుదలకు నెల రోజుల గ్యాప్ కూడా ఉండదు కనుక.. వెనువెంటనే మూడో పాత్ర అయిన 'కుశ' టీజర్ ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు బాబి దర్శకత్వం వహిస్తున్నాడు.