HeadLines

రానా సరసన నారా రోహిత్ హీరోయిన్

నారా రోహిత్‌కు జంటగా 'అసుర' సినిమాలో నటించిన ప్రియా బెనర్జీ గుర్తుందా..? ఈ సినిమా తర్వాత తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో మకాం బాలీవుడ్ కు మార్చి.. అక్కడ చిన్న చిన్న హిందీ చిత్రాల్లో నటించిన ఈ బెంగాలీ బ్యూటీ.. తిరిగి టాలీవుడ్ కు వస్తోంది. అది కూడా రానా సరసన కావడం విశేషం.

'నేనే రాజు నేనే మంత్రి' చిత్రంలో కాజల్ తో రొమాన్స్ చేసిన రానా.. ఇలా అంతగా గుర్తింపు లేని హీరోయిన్ తో కలసి నటించడం అంటే నమ్మశక్యం కావడం కష్టమే. కాకపోతే.. రానా సరసన ప్రియా బెనర్జీ నటించబోయేది సినిమాలో కాదు.. ఓ వెబ్ సిరీస్ లో. 'సోషల్' పేరుతో తెరకెక్కే ఓ వెబ్ సిరీస్ లో నటించడానికే ఇప్పటికే ఓకే చెప్పాడు రానా.  శశి దర్శకత్వంలో ఈ వెబ్ సీరీస్ రూపొందుతోంది. తెలుగు, హిందీ భాషల్లో రూపొందే వెబ్ సీరీస్.. కావడంతో రానాకు జంటగా ప్రియా బెనర్జీని సెలక్ట్ చేశారట.

ఈ వెబ్ సిరీస్ గురించి ఓ రేంజ్ లో చెపుతోన్న ప్రియా బెనర్జీ.. ఇందులో సినిమా నటి పాత్రను పోషిస్తోందట. ఇంటర్నెట్ కు సంబంధించి ఓ సమస్యలో ఇరుక్కున్న హీరోయిన్ కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి.. వాటి నుంచి ఎలా బయటపడింది అనేది ఈ వెబ్ సిరీస్ కథాంశమట. మరి వెబ్ సిరీస్ తర్వాతైనా తెలుగులో బిజీ అవుతుందేమో చూద్దాం..