HeadLines

'హలోబ్రదర్' సీక్వెల్ ట్రైలర్ అదిరింది



నాగార్జున హీరోగా వచ్చిన 'హలో బ్రదర్' ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కుతోంది. కానీ తెలుగులో మాత్రం కాదు. అప్పట్లో ఈ సినిమా 'జుద్వా' పేరుతో సల్మాన్ హీరోగా హిందీలో రీమేక్ కాగా.. ఇన్నేళ్ల తర్వాత ఈ మూవీకి సీక్వెల్ రూపొందుతోంది. 'జుద్వా-2' పేరుతో రూపొందుతోన్న ఈ మూవీ ట్రైలర్ ఈరోజు విడుదలైంది.

సీక్వెల్ కు కూడా డేవిడ్ ధావనే దర్శకత్వం వహించాడు. అప్పట్లో సల్మాన్ ఖాన్ పోషించిన పాత్రను జుద్వా-2లో వరుణ్ ధావన్ పోషించాడు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్, తాప్సి హీరోయిన్లుగా నటించారు. ఇక ట్రైలర్ ను బట్టి చూస్తే... సీక్వెల్ కూడా 'జుద్వా'కు ఏమాత్రం తీసిపోని రీతిలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. పేరుకు సీక్వెల్ అయినప్పటికీ.. దాదాపుగా అదే స్టోరీ కనిపిస్తోంది. జాక్వెలిన్ కు ఏమాత్రం తీసిపోని రీతిలో బికినీలో రెచ్చిపోయింది తాప్సీ. మొత్తానికి ట్రైలర్ మాత్రం హిలేరియస్ కామెడీతో తెగ ఆకట్టుకుంటోంది. సెప్టెంబర్ లో ఈ మూవీ థియేటర్లలోకి రానుంది.