సంజయ్‌దత్ 'భూమి' ట్రైలర్
జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సంజయ్ దత్ వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. ఈ క్రమంలో సంజయ్‌దత్ నుంచి రాబోతున్న చిత్రం 'భూమి'. ఓమంగ్ కుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో అధితి రావు హైదారీ సంజయ్‌దత్‌కు కూతురుగా నటిస్తోంది. తండ్రి, కూతుర్ల అనుబంధం నేపధ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాను... సందీప్ సింగ్, భూషన్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్ కు మంచి స్పందన లభించగా.. ఈరోజు ట్రైలర్‌ను విడుదల చేశారు. సెప్టెంబర్ 22న ఈ సినిమాని విడుదల కానుంది.