HeadLines

అనిల్ కపూర్ గెటప్ లో బాలీవుడ్ హీరోయిన్

ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్ ఫరాఖాన్.. త‌న ఇన్‌స్టాగ్రాం అకౌంట్‌లో ఓ స్పెషల్ పిక్ పోస్ట్ చేసింది. పైడా ఆ ఫొటోలో అనిల్ కపూర్ వేషదారణలో ఉన్నది ఎవరో గుర్తుపట్టమంటూ ఓ కాంటెస్ట్ కూడా పెట్టింది. చటుక్కున గుర్తుపట్టడం కష్టమే అయినా.. నెటిజన్స్ మాత్రం ఆ ఫొటోలో ఉన్నది ఎవరనేది ఇట్టే కనిపెట్టేశారు. ఇందకూ ఆ ఫొటోలో ఉన్నది మరెవరో కాదు నిన్నటితరం బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్.

ఫరాఖాన్ వ్యాఖ్యాతగా త్వరలో స్టార్ ప్లస్ ఛానల్ లో ఓ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. `లిప్ సింక్ బ్యాటిల్‌` అనే ఇంగ్లీష్ టీవీ షో ఆధారంగా దీనిని రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా కరణ్ జోహార్, ప్రీతి జింటా, పరిణీతి చోప్రా, అర్జున్ క‌పూర్‌, ఫ‌ర్హాన్ అక్త‌ర్‌ వంటి సెలబ్రిటీస్ తో ఇప్పటికే కొన్ని ఎపిసోడ్స్ షూట్ చేసిన ఫరాఖాన్.. తాజాగా రవీనా టాండన్ ను ఈషోకు రప్పించింది. ఈషోలో పాల్గొనే సెలబ్రిటీస్.. కొన్ని పాటలకు స్టెప్పులేయడంతో పాటు.. పాటల్లో నటించిన వారి గెటప్ లో పెదవులు కదుపుతూ.. లిప్ సింక్ చేసేస్తారు. అతి త్వరలో ఈ కార్యక్రమం ప్రసారం కానుంది.