HeadLines

సెన్సార్ పూర్తయిన ‘జై లవ కుశ’


ఎన్టీఆర్ హీరోగా బాబి దర్శకత్వంలో రూపొందిన 'జై లవకుశ' చిత్రం ఈనెల 21న విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారం రోజుల ముందుగానే సెన్సార్ కార్యాక్రమాలను పూర్తి చేశారు. ఈ సినిమాకు ఎలాంటి కట్స్ ఇవ్వకుండా  ‘U/A’ సర్టిఫికెట్ ను జారీ చేసింది సెన్సార్ బోర్డు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత కళ్యాణ్ రామ్.. స్వయంగా వెల్లడించారు. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో నివేత థామస్, రాశీ ఖన్నా హీరోయిన్స్ గా నటించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చాడు.