మహేశ్ మూవీలో ఇలియాన లేనట్టే
మహేశ్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతోన్న 'భరత్ అనే నేను' చిత్రం ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ నెల 1 నుంచి తాజా షెడ్యూల్ ప్రారంభం కాగా.. ఈరోజు నుంచి మహేశ్ ఈ మూవీ సెట్ లో జాయిన్ అయ్యాడు. ఇదిలా ఉంటే.. మహేశ్-వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది.
ఈ సినిమా కోసం దర్శకనిర్మాతలు హీరోయిన్ గా ఇలియానతో సంప్రదింపులు చేశారని.. దాదాపుగా ఇలియాన ఎంపిక ఖరారు అయిందని గత కొద్ది రోజులుగా భారీ ప్రచారం జరుగుతోంది. గతంలో 'పోకిరి'లో నటించి హిట్ పెయిర్ అనిపించుకున్నారు కనుక ఇదే నిజమనుకున్నారంతా. కానీ.. నిర్మాత దిల్ రాజు ఈ విషయంపై వివరణ ఇచ్చారు.
ఇలియన నటిస్తోందంటూ వచ్చిన వార్తలన్నీ పుకార్లేనని.. ఈ సినిమా కోసం తాము ఇలియాన సంప్రదించనే లేదంటూ క్లారిటీ ఇచ్చాడు. దీంతో ఈ వార్తలకు చెక్ పడినప్పటికీ.. ఈ స్థానంలో ఎవరిని తీసుకుంటారనే విషయంపై మాత్రం సందిగ్ధం నెలకొంది. మరి ఆ ఛాన్స్ ఎవరిని వరించనుందో..!