HeadLines

'జై లవకుశ' ట్రైలర్ కు సూపర్ క్రేజ్, కథ ఏమిటంటే..



ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన 'జై లవకుశ' ట్రైలర్.. ఆదివారం సాయంత్రం విడుదలైంది. 2 మిముషాల 12 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ విడుదలైన కొద్ది సేపటికే ఈ ట్రైలర్ టాప్ ట్రెండింగ్ లో నిలబడింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ కు చెందిన అఫిషియల్ ఛానెల్ లో 3.4 మిలియన్ల వ్యూస్ దక్కించుకున్న ఈ ట్రైలర్... 1.5 లక్షలకు పైగా లైక్స్ ను అందుకోవడం విశేషం.

కథ ఏమిటంటే..
‘ముగ్గురు బిడ్డలు రావణ, రామలక్ష్మణులయ్యారు’ అనే డైలాగ్ తో ఎన్టీఆర్ పోషిస్తోన్న   జై, లవ, కుశ పాత్రలు.. అన్నదమ్ములు అనే విషయాన్ని రివీల్ చేయడంతో పాటుగా.. వారి పాత్రలకు సంబంధించిన స్వరూప స్వభావాల్ని ట్రైలర్ లో స్పష్టంగా చూపించారు. ఇక నిజాయితీ పరుడైన బ్యాంక్ ఆఫీసర్ లవ కు ఉన్న సమస్యలు చక్కదిద్దేందుకు ఆ స్థానంలో కుశ ఎంటరై.. మిగతా వర్కర్స్ ను హడలెత్తిస్తాడు. కానీ.. ఈలోపు 'జై' నుంచి వీరికి ఇబ్బందులు ఎదురవుతాయి. తన అనే స్వార్థం తప్ప.. మన అని ఆలోచించని కర్కషుడైన 'జై'ను 'లవకుశ'లు కలసి ఎలా ఎదుర్కొన్నారన్నదే ఈ సినిమా మిగతా కథగా తెలుస్తోంది. 'జై' రావణుడిగా మారడానికి కారణమేంటనేది కూడా ఈ సినిమాలో స్పెషల్ పాయింట్ అవనుంది.

కేవలం ట్రైలర్ తోనే వీరి పాత్రల స్వభావాలు ఇంతలా రివీల్ అవడానికి కారణం.. ఈ మూడు క్యారెక్టర్స్ మధ్య ఎన్టీఆర్ చూపించిన డిఫరెంట్ వేరియేషన్. బాడీ లాంగ్వేజ్, డైలావరీతో ఏ పాత్రకు ఆ పాత్ర ప్రత్యేకమైన ఐడెంటటీ ఉండేలా నటించాడు తారక్. మిగతా రెండు పాత్రల కంటే జై క్యారెక్టర్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా కనిపిస్తోంది.

కళ్యాణ్‌ రామ్ నిర్మించిన ఈ సినిమా ఈనెల 21న విడుదల కాబోతోంది. గతంలో వచ్చిన త్రిపాత్రాభినయ చిత్రాలకు భిన్నంగా కొత్తదనం ఉన్న కథయితే మాత్రం. ఈ సినిమా పెద్ద విజయం సాధించే అవకాశాలు ఎక్కువనే చెప్పాలి. దర్శకుడు బాబి..  ఈ మూడు క్యారెక్టర్ లను బ్యాలెన్స్ చేస్తూ కథ నడిపించే విధానంపైనే ఈ సినిమా విజయం ఆధారపడి ఉండనుంది.