ఆది 'నెక్స్ట్ నువ్వే' ట్రైలర్ టాక్
హారర్ కామెడీ జానర్ లో రూపొందిన ఈ సినిమా.. తమిళ హిట్ మూవీ ‘యామిరుక్క భయమే’కు రీమేక్. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకుని.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాను నవంబర్-3న విడుదల చేయబోతున్నారు. నలుగురు సభ్యుల తొట్టిగ్యాంగ్ హోటల్ పెడితే ఏం జరిగింది అనేది ఈ సినిమా కథ. ఇక ట్రైలర్ లో రష్మి స్పెసీ యాక్టింగ్ తో పాటు బ్రహ్మాజీ కామెడీ టైమింగ్ హైలెట్ గా నిలచింది. గత కొన్నాళ్లుగా వరుస పరాజయాలు అందుకుంటోన్న ఆదికి.. ఈ హారర్ కామెడీ రీమేక్ అయినా హిట్ ఇస్తుందేమో చూడాలి!