HeadLines

పుత్రోత్సాహం: పవన్ మళ్లీ తండ్రయ్యాడు..


ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి తండ్రి అయ్యాడు. పవన్ ప్రస్తుత భార్య అన్నా లెజినోవా.. హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అప్పుడే పుట్టిన తన కొడుకును చేతుల్లోకి తీసుకుని మురిసిపోయాడు పవన్. ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

మాజీ భార్య రేణుదేశాయ్ ద్వారా పవన్ కు ఇప్పటిఏ అకీరా, ఆద్య అనే ఇద్దరు సంతానం ఉన్నారు. ఇక విడాకుల అనంతరం ఆస్ట్రేలియకు చెందిన రష్యన్ వనిత అన్నా లెజినోవాను పవన్ పెళ్లాడగా.. ఈ జంటకు పొలేనా అనే కూతురుంది. ఈ పాప వయసు మూడేళ్లు కాగా.. తాజాగా పవన్ కు మరో వారసుడిని అందించారు లెజినోవా.

ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అజ్ఞాతవాసి' షూటింగ్ లో పాల్గొంటున్న పవన్.. భార్య డెలివరీ డేట్ దగ్గరపడడంతో కొద్దిరోజుల క్రితం యూరప్ షెడ్యూల్ ను వాయిదా వేసుకున్నాడు. ఇక పవన్ కు మరో వారసుడు పుట్టడంతో అభిమానుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు.