రాజ్ తరుణ్ సినిమాకు హీరోయిన్ మార్పు
'కిట్టు ఉన్నాడు జాగ్రత్త', 'అంధగాడు' సినిమాలతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చిన రాజ్ తరుణ్.. వచ్చే ఏడాది కోసం వరుసగా నాలుగైదు సినిమాలు సిద్ధం చేస్తున్నాడు. సంజనా రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'రాజుగాడు' చిత్రం రిలీజ్ కు రెడీగా ఉంది. మరోవైపు అన్నపూర్ణ సంస్థలో 'రంగుల రాట్నం' అనే సినిమా, దిల్ రాజు బ్యానర్ లో 'లవర్' అనే మూవీ సెట్స్ పై ఉన్నాయి. ఇవి కాక రీసెంట్ గా 'కుమారి 21-ఎఫ్' డైరెక్టర్ పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో మరో మూవీకి కమిట్ అయ్యాడు.
ఇదిలా ఉంటే.. దిల్ రాజు, రాజ్ తరుణ్ కాంబినేషన్ లో తెరకెక్కే సినిమాకు తాజాగా హీరోయిన్ ను మార్చేశారట. 'అలా ఎలా' ఫేం అనీష్ కృష్ణ దర్శకత్వంలో 'లవర్' టైటిల్ తో ఈ సినిమా రూపొందుతుండగా.. హీరోయిన్ గా మలయాళ నటి గాయత్రీ సురేష్ ను తీసుకున్నారు. అక్టోబర్ లో జరిగిన ఈ సినిమా ఓపెనింగ్ కు కూడా గాయత్రి హాజరైంది. కానీ.. ఇప్పుడా స్థానంలో పుణేకు చెందిన రిద్ధి కుమార్ అనే కొత్త భామను హీరోయిన్ గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే.. గాయత్రీ సురేష్ ను ఎందుకు కాదనుకున్నారో తెలియరాలేదు.