HeadLines

ప్రోగ్రెస్ రిపోర్ట్ కోసం ఖుష్బూ ఎదురుచూపులు

పవన్ కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అజ్ఞాతవాసి’ చిత్రం మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సినిమాలో కీలకమైన పాత్రను ఖుష్బూ పోషించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ రిలీజ్ సందర్భంగా ఖుష్బూ ఓ ట్వీట్ చేశారు.

దాదాపు పదేళ్ల విరామం తర్వాత తిరిగి తెలుగు తెరపై కనిపించబోతున్న ఖుష్బూ.. ఈ సందర్భంగా తనలో కలుగుతున్న భావనను ట్వీట్ రూపంలో వెల్లడించారు. "ఓ చిన్నారి ఫస్ట్ టైమ్ తన ప్రోగ్రెస్ రిపోర్టు కోసం ఎదురు చూస్తున్నట్టుగా అనిపిస్తోంది.. నా ఎదురుచూపులు విలువైనవి అని భావిస్తున్నా... త్రివిక్రమ్ పై నాకు ఉన్న నమ్మకం వమ్ము కాదనేది నా విశ్వాసం..." అంటూ ట్వీట్ చేసిన ఖుష్బూ పవన్ కు ధన్యవాదాలు తెలియజేశారు.