HeadLines

'తొలిప్రేమ' ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్

వ‌రుణ్ తేజ్‌, రాశి ఖ‌న్నా జంట‌గా రూపొందుతోన్న చిత్రం ‘తొలి ప్రేమ‌’. వెంకీ అట్లూరి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా పరిచయం అవుతుండగా.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో బి.వి.ఎస్‌.ఎన్‌. ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి-9న ఈ సినిమాను విడుదల చేయనుండగా.. తాజాగా ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు.

తమన్ సంగీతం సమకూర్చిన ఈ మూవీ ఆడియోను ఈనెల 20న విడుదల చేయడానికి నిర్ణయించారు. రీసెంట్ గా రిలీజైన "నిన్నిలా నిన్నిలా చూశానే.." అనే పాటకు మంచి స్పందన లభిస్తోంది. 'ఫిదా' తర్వాత వరుణ్ తేజ్ వస్తోన్న సినిమా కావడం.. ఒకప్పుడు పవన్ కు సూపర్ హిట్ ఇచ్చిన టైటిల్ కావడంతో.. మెగాఫ్యాన్స్ లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.