రివ్యూ: పొయిటిక్ గా థ్రిల్ చేసే 'రచయిత'
కొన్నాళ్లుగా రొటీన్ సినిమాలను డిజాస్టర్స్ గా మారుస్తూ.. కొత్తదనంతో వచ్చే చిత్రాలకు విజయాలు ఇస్తూ... వైవిధ్యానికి స్వాగతం చెపుతున్నారు ప్రేక్షకులు. అలాగని ఏ హాలీవుడ్ సినిమాలను మక్కీకి మక్కి దింపేస్తే మాత్రం ఛీ కొడుతున్నారు. ఈ క్రమంలో వైవిధ్యంగా ఉంటూనే తెలుగు నేటివిటీని చూపించగల సినిమాలు రావాల్సి ఉంది. తమ సినిమాలో ఇదే ఉందని చెపుతున్నారు 'రచయిత' టీమ్. విద్యాసాగర్ రాజు హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన 'రచయిత'లో సంచిత పదుకొనే కథానాయిక కాగా.. కళ్యాణ్ ధూళిపాళ్ల నిర్మించారు. ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమా మెప్పించిందా.. లేక నొప్పించిందో ఇప్పుడు చూద్దాం..!
కథ:
1950 కాలం నాటి కథ ఇది. ఎన్నో వైవిధ్యమైన నవలలతో ఆకట్టుకున్న పాప్యులర్ నవలా రచయిత ఆదిత్య వర్మ (విద్యాసాగర్ రాజు) భయం నేపథ్యంలో తన తదుపరి నవలను రాయబోతున్నట్టు ప్రకటిస్తాడు. ఈ క్రమంలో తాను పాఠశాల రోజుల్లో ప్రేమించిన అమ్మాయి పద్మావతి (సంచిత పదుకొనె)ను వివాహం చేసుకునేందుకు ఆమె తల్లితండ్రులను ఒప్పిస్తాడు. వారిని ఒప్పించి తాను నవల రాయడానికి ఎంచుకున్న నిర్మానుష్య ప్రదేశంలోని ఇంటికి పద్మావతిని తీసుకెళ్తాడు.
ఆ ఇల్లు పద్మావతికి కొత్తేం కాదు. గతంలో ప్రేమించిన యువకుడితో కొన్ని రోజులు ఆ ఇంట్లోనే నివాసముంది పద్మావతి. అతడు చనిపోయినప్పటికీ ఆ ఇంటికి సంబంధించిన వారిద్దరి పాత జ్ఞాపకాలు ఆమెను వెంటాడుతుంటాయి. కానీ ఆ విషయాన్ని రచయితకు చెప్పేందుకు మనసు ఒప్పుకోదు. దీంతో ప్రేమించిన వాడిని మరువలేక.. తననే ప్రేమిస్తూ, ఆరాదిస్తోన్న రచయితకు దగ్గరవలేక సతమతమవుతుంటుంది. మరోవైపు ఆ ఇంట్లో అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి. జీవితంలో జరిగే సంఘటనలు కొన్ని నవలలోకి వస్తుంటే.. నవలలో రాసుకున్న సంఘటనలే వారి జీవితంలో ఎదురవుతుంటాయి. పద్మావతి గతం ఏమిటి.. ఇంట్లో జరిగే సంఘటనలతో ఆ గతానికి లింకేంటి..? ఆదిత్య వర్మ, పద్మావతి ఒక్కటయ్యారా అనేది మిగతాకథ.
ఎవరెలా..
రచయిత ఆదిత్య వర్మ పాత్రలో విద్యాసాగర్ రాజు, పద్మావతిగా సంచిత పదుకొనె నటన ఆకట్టుకుంటుంది. ఒకరిద్దరు అతి చేసినా.. ఇతర పాత్రల నటులు పరిధిమేరకు నటించారు.
మలయాళ సంగీత దర్శకుడు షాన్ రెహమాన్ అందించిన సంగీతం, చంద్రబోస్ రాసిన పాటలు ఈ సినిమాకు ప్లస్ పాయింట్. కరుణాకర్ ఎన్నో అద్భుతమైన డైలాగ్స్ ఈ సినిమా కోసం రాశాడు. కానీ.. ఓ డైలాగ్ ను అర్థం చేసుకునేలోపు... వెంటవెంటనే మరో పది డైలాగులు క్యూ కట్టేస్తాయి. దీంతో ఆలోచింపజేసే సంభాషణలు ఉన్నా.. అందులో ఏ ఒక్కటీ సరిగా రిజిస్టర్ అయ్యే అవకాశం కలగలేదు.
1950 బ్యాక్ డ్రాప్ లో సినిమా అని ప్రకటించినప్పటికీ అందుకు తగ్గ ప్రమాణాలు కనిపించలేదు. మాటిమాటికి హీరోయిన్ చేతిపై కనిపించే ఫ్యాషన్ టాటూ.. హీరోయిన్ చిన్నతనంలో కొనుక్కునే బాల్ పాయింట్ పెన్, అప్పుడప్పుడే వస్తోన్న 'బ్రెయిలీ' లిపి (1951లో బ్రెయిలీ భారతీయ భాషల్లోకి వచ్చింది) తెలుగునాట మారుమూల ప్రాంతంలోని అమ్మాయి నేర్చుకోవడం.. వంటివి లాజిక్ కు అందని ప్రశ్నలు. గ్రాఫిక్స్ కూడా నాసిరకంగానే ఉన్నాయి. ఎడిటింగ్ ఇంకాస్త మెరుగ్గా ఉండాల్సి ఉంది. తెలుగులో వైవిద్యభరిత చిత్రాలు రావడం లేదనే వారే తప్ప ప్రోత్సహించే వారు లేని తరుణంలో.. ఈ మూవీని నిర్మించిన నిర్మాత కళ్యాణ్ ను, ప్రోత్సహించి ప్రమోట్ చేసిన జగపతిబాబు, చంద్రబోస్ లను అభినందించాలి.
దర్శకుడుని డామినేట్ చేసిన 'రచయిత'
లవ్, సస్పెన్స్, హారర్ లను మిళితం చేస్తూ రాసుకున్న 'రచయిత' కథ పరంగా బాగుంది. కథను ప్రారంభించిన విధానం కూడా బాగుంది. చెప్పాలనుకున్న విషయాన్ని సీరియల్ తరహాలో సాగదీయడమే సాధారణ ప్రేక్షకుడికి అసహనం కలిగిస్తుంది. మొత్తం కథను క్లైమాక్స్ కోసం దాచిపెట్టే ప్రయత్నంలో... ప్రారంభించిన చోటు నుంచి కథను వేగంగా ముందుకు నడపడంలో దర్శకుడు వెనకడుగు వేశాడు. కొద్ది పాత్రల నడుమ చాలా పెద్ద కథను చెప్పాలనుకోవడంలో దర్శకుడి నేర్పరితనం కనిపిస్తుంది. కానీ.. ప్రథమార్థం చాలా నెమ్మదిగా ఉండటం సినిమాకు మైనస్.
'రచయిత' అనే టైటిల్ ను.. తాను పోషించిన 'రచయిత' ఆదిత్య వర్మ పాత్రను దర్శకుడు అమితంగా అభిమానించిన ఛాయలు మనకు కనిపిస్తాయి. ఈ విషయంలో తాను సృష్టించిన పాత్రతో తానే ప్రేమలో పడ్డాడేమో అనిపిస్తుంది. తనకున్న లిమిట్స్ లో రచయిత పాత్రకు వీలయినంత హీరోయిజం యాడ్ చేయడానికి ప్రయత్నించాడనిపిస్తుంది. పైగా సినిమా రూపొందించడంలో విద్యా సాగర్ లోని రచయిత.. దర్శకుడిని పూర్తిగా డామినేట్ చేసేశాడు.
చూడాలా.. వద్దా..?
ఓ కవి పొయిట్రీ రాసినట్టు.. రచయిత నవలను రాసినట్టుగా దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించాడు.
సినిమాలా కాకుండా.. ఓ నవలనో లేక కవిత్వాన్నో చదివిన ఫీల్ తో దీన్ని చూడగలిగితే నచ్చుతుంది. ప్రస్తుతం నవలలు, దీర్ఘ కవితలు చదివే అలవాటు జనలాకు తగ్గుతోంది కనుక.. ఈ సినిమాను చూడాలా వద్దా అనేది ప్రేక్షకులు... ఎవరికి వారు వారి సొంత అభిరుచిని బట్టి నిర్ణయించుకోవాలి.
రేటింగ్.. 2.5/5