HeadLines

అదేం కాదు.. 'సాహో'నే ముందు

ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. మరోవైపు ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజుకు చెందిన గోపికృష్ణ బ్యానర్లో జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉంది. ప్రభాస్ సరసన పూజ హెగ్డే కథానాయకిగా నటించనున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ జూలై నుండి సెట్స్ పైకి వెళ్లబోతోంది.

'సాహో' సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కు ఎక్కువ టైమ్ పడుతుంది కనుక.. ఈ రెండు సినిమాల్లో రాధాకృష్ణ సినిమానే ముందుగా విడుదల కానుందనే ప్రచారం జరుగుతోంది. కానీ అలాంటిదేమీ లేదని.. 'సాహో'నే ముందుగా రిలీజ్ అవుతుందని.. కొద్దపాటి విరామంతో రాధాకృష్ణ మూవీ విడుదల కానుందని తెలుస్తోంది.