నాగచైతన్య 'సవ్యసాచి'లో హైలెట్ పాయింట్ ఇదే
నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతోన్న 'సవ్యసాచి' సినిమాలో సిస్టిర్ సెంటిమెంట్ హైలెట్ కానుందని తెలుస్తోంది. ఒకప్పుడు నాగార్జునకు జంటగా నటించిన భూమిక.. ఇప్పుడీ సినిమాలో నాగచైతన్యకు అక్కగా నటిస్తుండటం విశేషం.
అక్కకు జరిగే అన్యాయాన్ని ఎదిరించే యువకుడిగా నాగచైతన్య ఈ సినిమాలో నటిస్తున్నాడట. అక్కా-తమ్ముడి కాంబినేషన్ లో వచ్చే సీన్స్ సెంటిమెంట్ పరంగా హైలెట్ అవుతాయని చెపుతున్నారు. రీసెంట్ గా 'ఎంసీఏ'లో నానికి వదినగా నటించి సెకండ్ ఇన్నింగ్స్ లోనూ మెప్పించిన భూమిక.. ఇప్పుడు చైతూకు అక్కగా నటిస్తుండడంతో ఈ కాంబినేషన్ పై ఆసక్తి నెలకొంది. చైతు సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా జూన్ 14న విడుదల కానుంది.