చిరంజీవి చిత్రం షూటింగ్లో జాయిన్ అయిన నయన్
చిరంజీవి నటిస్తోన్న చారిత్రక చిత్రం ‘సైరా’.. ప్రస్తుతం హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తికాగా ఇది రెండో షెడ్యూల్. చిరంజీవి సరసన నయనతార కథానాయికగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సెకండ్ షెడ్యూల్ షూటింగ్ లో నయనతార జాయిన్ అయింది.
చిరంజీవి, నయనతార, జగపతిబాబుతో పలువురు ఇతర నటీనటుల కాంబినేషన్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరో కీలకపాత్ర పోషిస్తోన్న బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్.. ఈ నెల 28 నుంచి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన ఫొటో ఒకటి ఇప్పుడు లీకై.. నెట్ లో హల్ చల్ చేస్తోంది.