HeadLines

అదితిరావు హైదరికి నిత్యామీనన్ డబ్బింగ్ చెప్పిందా..?

సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'సమ్మోహనం'.  అదితిరావ్ హైదరి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్.. మంగళవారం సాయంత్రం విడుదలైంది. ఓ వైపు టీజర్ ఇంప్రస్ చేసిందనే ప్రశంసలు లభిస్తుండగా.. మరోవైపు హీరోయిన్ అదితిరావు హైదరీకి నిత్యామీనన్ డబ్బింగ్ చెప్పిందనే వార్తలు గుప్పుమంటున్నాయి.

నిత్యామీనన్ డబ్బింగ్ చెప్పిందనే ప్రచారంపై దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ స్పందించారు. ఈ సినిమాలో అదితి పాత్రకు నిత్య డబ్బింగ్ చెప్పిందని అంతా అనుకుంటున్నారని.. కానీ తన పాత్రకు తానే స్వయంగా అదితిరావ్ హైదరి డబ్బింగ్ చెప్పుకుందని క్లారిటీ ఇచ్చారు మోహన్ కృష్ణ. ఫ్యూచర్ లో ఈ విషయంపై ఎలాంటి రూమర్స్ రాకుండా ఉండేందుకే ఈ క్లారిటీ ఇస్తున్నానని మోహన్ కృష్ణ తెలిపారు. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ మూవీ జూన్-15న జనం ముందుకు రాబోతోంది.